Thursday, August 21, 2025

కర్నాటక ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య, డికె శివకుమార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్యజీ, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డికె శివకుమార్‌జీలకు అభినందనలు.

ఫలప్రదమైన పదవీకాలం కోసం నా శుభాకాంక్షలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధరామయ్యను అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News