Saturday, May 11, 2024

మిల్లులకు వచ్చే ధాన్యాన్ని త్వరత్వరగా దించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ రమేష్

మెదక్: రైతులకు ఇబ్బందులకు గురిచేయకుండా మిల్లులకు వచ్చే ధాన్యాన్ని త్వరత్వరగా దించుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ మిల్లర్లకు సూచించారు. ఆదివారం జరిగిన దశాబ్ది ఉత్సవాల సన్నాహాక సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంపై సమీక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్‌ను ఆదేశించిన మేరకు సోమవారం జిల్లాకు వచ్చిన ధాన్యం సేకరణ జనరల్ మేనేజర్ రాజిరెడ్డితో కలిసి తన చాంబర్‌లో రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ధాన్యం తరలించుటకు అనుమతి వచ్చినందున మిల్లులకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని కోరారు. జిల్లాలో ఇంకా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని అన్నారు.

వర్షాలు పడే సూచనలున్నాయని వాతవరణ హెచ్చరిక నేపథ్యంలో నాలుగైదు రోజులల్లో ధాన్యం శ్రీఘ్రంగా దించుకుని ట్రక్ షీట్ అందించాలని, తద్వారా రైతులకు కూడా త్వరితగతిన డబ్బులు వారి ఖాతాలో జమాచేయుటకు వీలుంటుందని అన్నారు. కాగా ఇతర జిల్లాలకు ధాన్యం తరలింపబడుతున్నందున అందుకనుగుణంగా మిల్లులకు బాయిల్డ్ రైస్ కేటాయింపులు పెంచాలని రైస్‌మిల్లుల సంఘం అద్యక్షులు చంద్రపాల్ కోరగా పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News