Sunday, May 5, 2024

డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి చర్చలు జరిపామన్నారు. రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పున:ర్విభజన ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

డీలిమిటేషన్ ఇప్పటికిప్పుడే జరుగుతోందని చెప్పలేమన్నారు. నార్త్, సౌత్ అంటూ విభేదాలు సృష్టించవద్దని ఆయన కొరారు. ప్రధాని మోడీకి నార్త్, సౌత్ అంటూ తేడా ఉండదన్నారు. బిజెపి జాతీయ భావజాలంతో పనిచేసే పార్టీ అన్నారు. ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్ అనేది బిజెపి విధామని తెలిపారు. పిపి నర్సింహరావు, దేవెగౌడ ప్రధానులు కలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News