Saturday, May 4, 2024

సంగారెడ్డిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలంకరణ చేసి, పిమ్మట అమర వీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత జిల్లాలో జరిగిన అభివృద్ధిని మంత్రి వివరించారు. జిల్లా అన్ని రంగాలలో ప్రగతి దిశగా పయనిస్తుందని రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.

తెలంగాణ కోసం అసువులు బాసిన జిల్లాకు చెందిన కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన భార్గవ్ తండ్రి నోముల సత్యనారాయణను మంత్రి సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా బాలసదనం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి , శాసనసభ్యులు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మానిక్ రావు, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రమణ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News