Tuesday, May 7, 2024

పత్రికా స్వేచ్ఛ దెబ్బతింటోందనేది నిజమే…

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజోపకారి, ఇది పతనం చెందితే ప్రపంచానికి, అమెరికా జాతీయ ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ విషయం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇచ్చారు.

ఇక్కడి పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమైన రీతిలో ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అవుతుంది. విమర్శలను ఎవరైనా స్వీకరించాల్సిందే . విమర్శలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటే దక్కే సమన్వయంతో చివరికి ప్రజాస్వామిక ప్రక్రియ బలోపేతం అవుతుందన్నారు. అయితే ఇప్పుడు పత్రికా స్వేచ్ఛను మన్నించే పరిస్థితి కనుమరుగు అవుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News