Thursday, May 30, 2024

కారు ఢీకొని గర్భిణీ మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: ఎన్టీపీసీ నుంచి మల్యాలపల్లికి స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 8 నెలల గర్భవతిగా ఉన్న కత్తెరమల్ల నిహారిక (22) మృతి చెందింది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మల్యాలపల్లి గ్రామానికి చెందిన కత్తెరమల్ల క్రాంతి, అతని భార్య నిహారికలు సోమవారం ఉదయం సొంత పనుల నిమిత్తం ఎన్టీపీసీ మీ సేవా కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీపీసీలోని రాజీవ్ రహాదారి క్రషర్ నగర్ వద్ద స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. స్కూటీపై వెనుక కూర్చున్న నిహారికకు తీవ్ర గాయాలు కావడంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News