Saturday, May 11, 2024

ఎంపి పదవికి జాన్సన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తమ ఎంపి పదవికి రాజీనామా చేశారు. పదవీకాలంలో ఆయన పార్లమెంట్‌ను పక్కదోవ పట్టించినందున త్వరలో ఆయనపై ఆంక్షలు వెలువడనున్న దశలో జాన్సన్ ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దేశంలో కోవిడ్ ఉధృతి దశలో ఆయన విచ్చలవిడిగా నివాసంలో విందులు జరిపించడం పార్టీగేట్‌గా వివాదానికి దారితీసింది. దీనిపై చేపట్టిన దర్యాప్తు నివేదిక వెలువడింది. ఇక దీని మేరకు జాన్సన్‌పై చర్యలకు రంగం సిద్ధం అవుతోంది.

ఈ విషయాన్ని తనకు అధికారులు సూచనప్రాయంగా తెలియచేయడంతో తాను ముందుగా ఎంపి స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఈ పలు ఒడుదుడుకుల నేత జాన్సన్ తెలిపారు.సుదీర్ఘ రాజీనామా లేఖలో ఆయన తన రాజకీయ ప్రత్యర్థులపై మండిపడ్డారు. కొందరు తనకు వ్యతిరేకంగా పావులు కదిపారని, తనను ఏదో విధంగా జనజీవన స్రవంతి నుంచి దూరం ఉంచాలనేదే వారి ఆలోచన అని విమర్శించారు. ఇప్పుడు తాను పార్లమెంట్‌కు దూరం కావడం బాధాకరంగానే ఉందని తెలిపిన జాన్సన్ , అయితే ఇది కేవలం తాత్కాలికమే అని, తాను తిరిగి ముందుకు వెళ్లుతానని చెప్పారు. తనపై దర్యాప్తు జరిపిన కమిటీ కంగారూ కోర్టుగా మారిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News