Friday, November 1, 2024

మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: గత ఎన్నికలలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ది చేందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమౌతుందని, ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి ఆశ్విరదించారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. శనివారం సాగర్ రహదారీ తుర్కయంజాల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్‌లో విలేకరుల సమావేశం ఎర్పాటు చేసిన సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ అధికారులను భయాభ్రాంతులకు గురిచేస్తు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్దికి అడ్డుపడుతున్నాడని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

శుక్రవారం 16వ తేదీన నిర్వహించిన పట్టణప్రగతిలో కార్యక్రమంలో ఛైర్‌పర్సన్, కౌన్సిల్ సభ్యులు లేకుండ ఏవిధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఎర్పడినప్పటి నుండి అభివృద్దికి ఎన్ని నిధులు మంజూర్ చేశారో తుర్కయంజాల్ చౌరస్తాలో బహిరంగంగా తెలపాలని సవాల్ విసిరారు. ప్రజలు చేల్లించే టాక్స్‌ల వల్లే అభివృద్ది పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తుర్కయంజాల్ ఫరిధీలో ఉన్న దళితుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటు కోట్ల రూపాయలు ఘడించారని విమర్శించారు. మున్సిపాలిటీ అభివృద్దికి మాత్రం నయాపైస ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా భూములు అమ్మితే రానున్న రోజులలో ప్రజల సౌకర్యార్ధం అసుపత్రి నిర్మాణం, మున్సిఫల్ కార్యాలయ నిర్మాణం, క్రీడాకారులకు స్టేడియం, చనిపోతే అంత్యక్రియలకు స్మశానాలు, పలు మౌళిక వసతులకు నిర్మాణాలు చేపట్టలన్నా భూములు లేకుండ పూర్తిగా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు.

ప్రక్కన ఉన్న మహెశ్వరం నియోజకవర్గంలో హెచ్‌ఎండిఏ నిధులు 300 నుండి 500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఏలాంటి నిధులు రావడం లేదు ఎందుకో. వివరణ ఇవ్వాలని కొరారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కొషిక ఐలయ్య, మున్సిపాలిటీ ఆధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, పిసిసి కార్యదర్శి కాకుమాను సునీల్, కౌన్సిలర్‌లు బండారి బాలప్ప, కంబాలపల్లి ధన్‌రాజ్, కోఅప్షన్ సభ్యులు సుజాత్ అలీ, నాయకులు గుండ్లపల్లి ధన్‌రాజ్‌గౌడ్, మేతరి దర్శణ్, కాకుమాను చేన్నయ్య, గౌస్ పాష, మంకాల్ దాసు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News