Friday, May 30, 2025

ద్విచక్ర వాహనంపై నుంచి పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి యువకుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన పాండవుల అనిల్(24) అనే యువకుడు నల్లబెల్లిలోని సిమెంటు రెడీమిక్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అనిల్ తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపుతప్పి కింద పడటంతో తీవ్రగాయాలు కాగా వెంటనే నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News