Monday, June 3, 2024

ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం.. భారత్‌కు అమెరికా మద్దతు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అణు సరఫరాదారుల సమూహం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌ఎన్‌ఎస్‌జి) లో భారత్ చేరేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన భాగస్వాములతో కలిసి వెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన తరువాత అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం తరువాత

ఉభయ దేశాలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో అణుశక్తి పోషించే ముఖ్యపాత్రను స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంధన అవసరాలను పరిష్కరించడానికి ,వాతావరణాన్ని పరిరక్షించుకోడానికి అణుశక్తిని ఓ వనరుగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News