Thursday, September 18, 2025

అన్ని విషయాలు రాహుల్ కు చెబుతా: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగే అన్ని విషయాలు ఎఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి చెబుతానని ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్‌కు వివరిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపురించిందన్నారు. ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తానని తాను అనుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత చేసినా తనని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తనకు అర్థం కావడంలేదని వాపోయారు. ఎన్నికల వ్యూహాలపై రాహుల్ గాంధీ తనని పిలిచారన్నారు.

Also Read: నదిలో కొట్టుకుపోయిన కారు..మహిళను కాపాడిన స్థానికులు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News