Wednesday, May 22, 2024

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ముథోల్ నియోజకవర్గ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని గడ్‌చాంద, బామ్ని (కె) గ్రామాలలో మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ మండల బిజపి నాయకులతో కలిసి పల్లె పల్లెకు బిజెపి గడపగడపకు మోహన్ రావు పేటల మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వహించారు.

ముందుగా గ్రామాలోని పార్టీ జెండాలను ఆవిష్కరించి రాష్ట్ర అభివృద్ధ్దికి బిజెపి సర్కారు అందిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలు కలిగి ఉన్న క్యాలెండర్‌ను ప్రజలకు అందించి అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయుల సంపూర్ణ మద్దతుతో ప్రధానమంతి మోడీ పాలనలో జరుగుతున్న దేశాభివృద్ధ్దిని చూసి ప్రపంచ దేశాలు సైతం సంభ్రమశ్చర్యానికి గురవుతున్నాయని అన్నారు.

వందలాది మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబీకులు అనుచర వర్గాలకు దోచిపెడుతున్నాడని ఇకనైనా ప్రజలు కళ్లు తెరిచి రాష్ట్ర సంపదను కొల్లగొట్టి మాయమాటలతో ప్రజలను దగా చేస్తున్న కెసిఆర్ పాలనకు స్వస్తి పలకాలని నిరంతరం ప్రజా శ్రేయస్సు అభివృద్ధ్ది ఆరాటపడే డబుల్ ఇంజన్ సర్కారు బిజెపితోనే రాష్ట్ర అభివృద్ధ్ది సాధ్యమని తదితర విషయాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News