Tuesday, May 14, 2024

మమతాబెనర్జీ ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపాన సెవోక్ విమానస్థావరం వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. జలపాయ్‌గురిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన తరువాత హెలికాప్టర్‌లో ఆమె బాగ్‌డోగ్రా బయలుదేరారు.

బైకుంఠపూర్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా, భారీగా వర్షం కురుస్తుండడంతోపాటు, ఎదురుగా ఏదీ సరిగ్గా కనిపించని పరిస్థితి తలెత్తడంతో సెవోక్ ఎయిర్‌బేస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలట్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రోడ్డుమార్గంలో బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారని, అక్కడ నుంచి కోల్‌కతా బయలుదేరి వెళ్లారని అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో జులై 8 న పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో వాయువ్యబెంగాల్ లోని అనేక ప్రాంతాల్లో మమతాబెనర్జీ ప్రచారం సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News