కోల్‌సిటీ: గోదావరిఖనిలోని యూనివర్శిటి పిజి కళాశాలలో ఎంసెట్ 2023 ధృవీకరణ పత్రాల పరిశీలన జులై 2 వరకు కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రమాకాంత్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, కులం, ఆదాయం సర్టిఫికేట్లు, ఈడబ్లూఎస్ వర్తించినచో అన్ని పత్రాలు ఒక జత జిరాక్స్, ఒరిజినల్ సర్టిఫికేట్లతో సర్టిఫికేట్ వెరఫికేషన్‌కు రావాలని హెల్ప్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సురేష్ కుమార్ తెలిపారు.
ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు జులై 8 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని, హెల్ప్‌లైన్ సెంటర్ కో ఆర్డినేటర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ ధ్రువపత్రాల పరిశీలనలో వెరిఫికేషన్ అధికారులు డాక్టర్ రమేష్, డాక్టర్ రవి, డాక్టర్ ప్రసాద్, అజయ్, సావిత్రి, యాదవయ్య పాల్గొన్నారు.