న్యూఢిల్లీ : జులై 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి భేటీ జరుగుతుంది. దీనిని అధికారికంగా గురువారం ప్రకటించారు. అయితే విదేశీ పర్యట నుంచి వచ్చిన తరువాత ప్రధాని మోడీ బిజెపి నేతలతో మంతనాలు సాగించారు. కొన్ని రాష్ట్రాల బిజెపి నేతలను తప్పించడం, మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించడం వంటి విషయాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు నిర్థారణ అవుతున్న దశలో ఈ మంత్రి మండలి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక్కడి ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మితం అయిన కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మంత్రి మండలి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ ఏడాది ముగిసేలోగా పలు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు మంత్రులను తప్పించి రాష్ట్రాల బాధ్యతలు అప్పగించాలనే విషయంపై కసరత్తు జరిగినట్లు, ఈ క్రమంలోనే మంత్రిమండలి భేటీ జరుగబోతోంది.