Wednesday, August 20, 2025

నేడు మంత్రి కెటిఆర్ మహబూబాబాద్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః పలు అభివృద్ది పనులు ప్రారంభించేందుకు నేడు మహబూబాబాద్ జిల్లా మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి తారక రామారావు పర్యటించనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ కలిసి వెళ్లనున్నారు. ఉదయం 8 గంటల సిఎం క్యాంపస్ బేగంపేట నుంచి బయలుదేరి 10.30 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకుని మున్సిపాలిటీ పరిధిలో రూ. 50 కోట్ల పనులకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరిస్తారు.

11 గంటలకు కూరగాయల మార్కెట్ ప్రారంభం, 11.15 గంటలకు గుమ్ముడూరు వద్ద రెండ పడకల ఇళ్లు ప్రారంభిస్తారు. 11.30 గంటలకు పోడు భూముల పట్టాలు పంపిణీ, ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 2.30 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణమై 5.30 గంటలకు సిఎం క్యాంపస్‌కు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News