Sunday, May 12, 2024

ఆర్థిక అక్షరాస్యత క్విజ్ పోటీల విజేతలకు నగదు, బహుమతులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ నుండే ఆర్థిక శిక్షణ అవసరమని, ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరు అలవరచుకోవాలని జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని సైన్స్ మ్యూజియంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై ఆర్‌బిఐ నేషన్ క్విజ్ కాంపిటేషన్ నిర్వహించారు.

పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎస్‌బిఐ అధికారులు మొదటి బహుమతి పదివేలు, రెండవ బహుమతి 7500,మూడవ బహుమతి 5వేల నగదును బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డిఎం గోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నరేంద్ర, డిడిఎం నాబార్డ్ కృష్ణతేజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News