Monday, May 12, 2025

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

కాగా, అర్ధరాత్రి హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో గ్రేటర్ వరంగల్ లో రహదారులు జలమయమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News