Thursday, August 28, 2025

కేతిరెడ్డిలా దోచుకోవడం నాకు చేతకాదు: జెసి ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అనంతపురం: వైసిపి ఎంఎల్‌ఎ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఎంఎల్‌ఎ పదవి లేకుంటే కేతిరెడ్డి బతకలేరని, పదవి లేదనే దిగులుతోనే తాడిపత్రి ఎంఎఎల్ కేతిరెడ్డి, ధర్మవరం ఎంఎల్ఎ కేతిరెడ్డి పెద్దారెడ్డి చనిపోతారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జెసి మీడియాతో మాట్లాడారు. కేతిరెడ్డిలా దోచుకోవడం తనకు చేతకాదని, పోలీసులు లేకుండా కేతిరెడ్డి, పెద్దారెడ్డి బయటకు రాగలరా? అని ప్రశ్నించారు. కేతిరెడ్డి చెప్పుతో కొడతా అంటావా? కొట్టు చూద్దామని జెసి సవాలు విసిరారు. త్వరలోనే ప్రజలే మిమ్మల్ని చెప్పులతో కొడతారని విమర్శించారు. మీ నాన్నను చంపిన వాళ్లతో ఎందుకు రాజీ అయ్యారని అడిగారు. మీ తాత చనిపోతు ఎందుకు పోలేదని ప్రశ్నించారు.

Also Read: సీతక్కను సిఎం చేస్తాం: రేవంత్ రెడ్డి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News