Thursday, September 18, 2025

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి

- Advertisement -
- Advertisement -

మక్తల్ ః గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారు విశేషంగా రాణించేలా ప్రోత్సహించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేష్ అన్నారు. మండలంలోని చిట్యాలలో ఆదివారం కోచ్ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు పరుగు పోటీలు, లాంగ్ జంప్ పోటీలను ఏర్పాటు చేసి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఆయా పోటీల్లో కె.శివ, యు.గోవిందు, వి.శివకుమార్, నందిని, నిర్మల, అర్చనలు ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో పీఈటీలు రమణ, బి.రూప, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News