Friday, May 17, 2024

జూరాలకు స్వల్పంగా వరద

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, త్రాగు నీటి అవసరాలకు వరప్రదాయంగా మారిన ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. వానకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న జూరా ల ప్రాజెక్టుకు ఎలాంటి వరద నీరు రాకపోవడంతో జూరాల ప్రాజెక్టు డెడ్‌స్టోరేజ్‌కు దిశ గా మారింది. వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి స్వల్పంగ వరద పెరిగింది. దీనికి తోడు జూరాల ఎగువ ఉన్న కర్ణాటకలోని సన్నతి భీమా ఉపనది నుంచి 15 గేట్ల ద్వారా కృష్ణానదిలోకి 28వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.

ఈ సీజన్‌లో జూ రాలకు వరద ప్రవాహం మొదటిసారిగా ప్రారంభమైంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో శనివారం సాయంత్రం పూర్తి స్థాయి నీటి మట్టం 316.516 మీటర్లు, 7.517 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 30,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో నెట్టెంపాడుకు 750, ఎడమ కాలువకు 820 క్యూసెక్కుల చొప్పున నీటిని వినియోగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News