Monday, November 11, 2024

అస్సాంలో వరద నష్టాలపై కేంద్ర బృందం సమీక్ష

- Advertisement -
- Advertisement -

గువాహటి : అస్సాంలో వరదల వల్ల మౌలిక సౌకర్యాలకు ఏ సమయంలో ఎంత నష్టం జరిగిందో తెలియజేసే ఫోటోలతో సహా నివేదిక సమర్పించాలని కేంద్ర బృందం అస్సాం ప్రభుత్వాన్ని కోరింది. వరదల వల్ల ఇళ్లకు , వ్యవసాయానికి జరిగిన నష్టాల జాబితాతో తుది నివేదిక సమర్పించాలని సూచించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సిజి రజినీకాంథాన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి గురువారం నుంచి మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించింది.

లఖింపుర్, ధెమాజీ, బిస్వనాథ్, బక్సా, బార్పేట్, చిరంగ్, బజలి, నల్బరి జిల్లాలో బృందం పర్యటించింది. శుక్రవారం రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమై వరద నష్టాలపై సమీక్ష నిర్వహించింది. నివేదిక సమర్పించిన తరువాత కావలసిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని రాష్ట్రప్రభ్వుం కేంద్ర బృందాన్ని అభ్యర్థించింది. దీనిపై తమ సిపార్సులతో నివేదిక కేంద్రానికి వెంటనే సమర్పిస్తామని కాంథాన్ హామీ ఇచ్చారు. అస్సాంలో వరదలకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు జిల్లాల్లో దాదాపు 9000 మంది వరద బాధితులుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News