Wednesday, May 8, 2024

ఉత్తరప్రదేశ్‌లో హిజ్రాల దారుణం

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండు గీసి అతడిపై మూత్ర విసర్జన చేసే దారుణ సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని కోస్‌గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్‌లు రంగం లోకి దిగి ఐదుగురిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే అదే తరహాలో ఈ సంఘటన జరగడం సంచలనం కలిగిస్తోంది. కోస్‌గంజ్ ప్రాంతంలో ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండుగీసి అతడిపై మూత్ర విసర్జన చేయడమే కాకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు. అయితే అక్కడికి దూరంగా పనిచేస్తున్న కొందరు ఇది గమనించి హిజ్రాల దాడి నుంచి బాధితుడిని రక్షించ గలిగారు.

రెండు హిజ్రా వర్గాల మధ్య విభేదాలే ఈ సంఘటనకు కారణంగా తెలుస్తోంది. బాధితుడు రఫీకుల్ ఓ వర్గానికి చెందిన నాయకురాలి ఇంట్లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. గురువారం రఫీకుల్ వ్యక్తిగత పనిమీద వెళ్తుండగా, ఐదుగురు హిజ్రాలు అతడిని అడ్డగించి తిట్టారు. అతడి దగ్గరున్న రూ. 1000 నగదు లాక్కున్నారు. ఆ తర్వాత అతడికి ఒకరు గుండు గీస్తుండగా, మిగతా వారంతా చుట్టూ చేరి వీడియో తీశారు. అతడి ముఖంపైన, నోట్లో మూత్ర విసర్జన చేశారు. మూత్ర విసర్జన చేసిన తరువాత తనను కూడా హిజ్రాగా మార్చడానికి వారు ప్రయత్నించారని రఫీకుల్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News