Monday, May 20, 2024

రెండు రోజలు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 23 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. పశ్చిమ దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అదేవిధంగా గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News