Wednesday, May 15, 2024

రాజ్యసభలో రేపు ఢిల్లీ బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ దశలో దీనిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో సభకు హాజరు కావాలని ఆమ్ ఆద్మీపార్టీ , కాంగ్రెస్‌లు వేర్వేరుగా తమ పార్టీల సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. లోక్‌సభలో ఈ నెల 3వ తేదీన బిల్లుకు ఆమోదం తెలిపింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతారు. ఇక్కడ ఆమోదం దక్కితే ఇక బిల్లు పార్లమెంట్ ఆమోద ముద్రను దక్కించుకుని ఇక ఢిల్లీలో అధికారులపై నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లుతుంది. ఎగువసభలో బిల్లు దశలో తమ పార్టీ సభ్యులకు ఆప్, కాంగ్రెస్‌లు కేవలం మూడు లైన్ల విప్ వెలువరించిందని వెల్లడైంది. సోమ, మంగళవారాలలో సభ్యులంతా సభకు హాజరు కావాలని విప్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News