Sunday, June 9, 2024

నేడు మహబూబ్‌నగర్‌లో ‘ఈశా గ్రామోత్సవం’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హాజరు కానున్న క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి జోగినపల్లి

హైదరాబాద్ : క్రీడాకారులతో నిర్వహించబడే సద్గురు ఈశా గ్రామోత్సవం నేడు శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఇంకా ప్రముఖ నేపధ్య గాయకుడు రామ్ మిరియాల ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని క్రీడాశాఖ పిఆర్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని డిస్టిక్ స్పోర్ట్ అథారిటీ (డిఎస్‌ఏ) గ్రౌండ్ మెయిన్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని వెల్లడించింది. పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్, గ్రామీణ ఆటలు ఇంకా సాంప్రదాయ కళలు ఈ గ్రామోత్సవంలో ముఖ్య విభాగాలని వెల్లడించింది. కాగా 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం క్రీడలు గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించబడినదని తెలిపింది.

ఈశా గ్రామోత్సవం ఇప్పటి వరకు తెలంగాణలో,  ఇంకా ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో దాదాపు 80,000 మందికి పైగా క్రీడాకారులతో నిర్వహించబడుతోందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపింది. కాగా ఇదే ఈశా గ్రామోత్సవం ఆగస్టు 11న మహబూబ్‌నగర్‌లోనూ, ఆగస్టు 19, 20 తేదీలలో సిద్దిపేటలోనూ, ఆగస్టు 26,27 తేదీలలో జనగాం, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, యదాద్రి జిల్లాలలో కూడా ఈ పోటీలు జరగనున్నాయని వెల్లడించింది. గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని చాటే ఈ వినూత్నమైన క్రీడా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తమ పేర్లను ఆన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కోసం https://isha.co/gramotsavam-teluguలో గానీ లేదా ఫోన్ నం : 8300030999లో గానీ సంప్రదించవచ్చని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News