Tuesday, May 21, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం సోమవారం కూడా తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, ఆదివారం శ్రీవారిని 84,401 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 37,738మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News