Sunday, July 27, 2025

చిన్నారి ప్రాణం తీసిన వేరుశనగ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో రెండేళ్ల చిన్నారి గొంతులో వేరుశనగ విత్తనం ఇరుక్కొని మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతం వసంతపూర్ గ్రామానికి చెందిన హనుమంతు తన భార్య పిల్లలతో కలిసి నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. హనుమంతు కూతురు నయనశ్రీ ఆడుకుంటూ వేరుశనగలు దగ్గరికి వెళ్లింది. వేరుశనగను గొంతులో పెట్టుకోవడంతో ఊపిరాడక కిందపడిపోయింది. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. దీంతో హనుమంతు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: పంచాయతీ కార్మికులకు జీవిత బీమా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News