Wednesday, September 17, 2025

రామగుండం సింగరేణిలో ప్రమాదం… కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఒసిపి-3 ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. బుల్ డోజర్ ఢీకొని ప్రైవేటు ఒబి ప్రాజెక్టు కార్మికుడు దుర్మరణం చెందాడు. మృతుడు మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలికి చెందిన గంగా ప్రసాద్(24)గా గుర్తించారు. పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read: ఖాతాదారులకు తెలియకుండానే రూ. లక్ష వరకు నగదు జమ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News