Wednesday, May 21, 2025

2014లో అధికారం లోకి వచ్చిన వారు 2024లో అవుట్ : అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని నిందిస్తూ ఎవరైతే 2014లో అధికారం లోకి వచ్చారో వారు 2024లో బయటకు పోతారని సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్ గురువారం వ్యాఖ్యానించారు. ముంబైలో ఇండియా కూటమి సమావేశానికి సైఫై నుంచి బయలుదేరే ముందు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. ఇండియా కూటమి సమావేశాలు కొనసాగుతుండడం తనకు ఆనందం కలిగిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ అధికారం నుంచి దిగిపోతుందని, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమైన పాత్ర వహిస్తుందని, ఆ రాష్ట్రం నుంచి 80 మంది ఎంపీలు ఎన్నికవుతారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News