Wednesday, May 15, 2024

మిలిటరీ విమానంలో లోపాలు.. కెనడా ప్రధాని పర్యటన వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడియో, ఆయన ప్రతినిధి బృందం స్వదేశీ పర్యటన ఒక్కరోజు ఆలస్యం అయింది. జి20 సదస్సుకు వచ్చిన వీరు ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి కెనడాకు బయలుదేరాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రధానితో పాటు ఆయన బృందం ఆదివారం రాత్రి తిరిగి ఇక్కడ ఫైవ్‌స్టార్ హోటల్‌లోనే ఉండాల్సి వచ్చింది.

కెనడాకు చెందిన సాయుధ బలగాల సిఎఫ్‌సి001 విమానంలో సాంకేతిక క్లిష్టత వీరి టూర్‌కు బ్రేక్ వేసింది. సాంకేతిక సమస్యలు తీరే వరకూ ఇండియాలోనే ఉండాల్సి ఉంటుందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News