Wednesday, May 15, 2024

కావేరీ వివాదం: నోట్లో చచ్చిన ఎలుకలతో తమిళనాడు రైతుల నిరసన

- Advertisement -
- Advertisement -

చెన్నై: కావేరీ జలాల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో తీవ్ర నిరసనలకు దారితీసింది.

రైతులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులతోసహా అన్ని వర్గాలకు చెందిన కన్నడ ప్రజలు తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై నిరసనను వ్యక్తం చేస్తుండగా తమిళనాడులో సైతం కావేరీ జలాల విడుదల కోరుతూ నిరసనలు జోరుగా సాగుతున్నాయి. తిరుచిరాపల్లిలో తమిళ రైతులు కావేరీ జలాల విడుదలపై కర్నాటక ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియచేస్తూ నోట్లో చచ్చిన ఎలుకలను ఉంచుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కావేరీ జలాలలను వెంటనే తమిళనాడుకు విడుదల చేయాలని వారు డిమాండు చేశారు.

కాగా..తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్నాటక రాజధాని బెంగళూరులో మంగళవారం బంద్ జరుగుతోంది. కన్నడ అభిమానులైన వివిధ రంగాలకు చెందిన నిరసనకారులు బంద్‌లో పాల్గొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News