Friday, May 10, 2024

ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: క్రూడ్ ఆయిల్ 100 డాలర్లకు పెరగొచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, హమాస్ మధ్య యు ద్ధం తీవ్రతరం అయితే ముడిచమురు ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు నుండి ప్రపంచ క్రూడ్ ఆ యిల్ ధరలు అస్థిరతకు లోనవుతుండగా, ఈ జిప్ట్, లెబనాన్ వంటి ఇతర దేశాలు రంగంలోకి దిగితే పరిస్థితి సమస్యాత్మకంగా మారవ చ్చు. యుద్ధం ముదిరితే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 95 నుండి 100 డాలర్ల వరకు పెరగవచ్చని ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌లోని పరిశోధన విశ్లేషకుడు తెలిపారు.

ఇజ్రాయెల్‌కు సహా యం చేయడానికి అమెరికా ఆయుధాలను పంపింది. ఇరాన్ హమాస్‌కు సహాయం చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో సంఘర్షణ ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కు చెందిన ఒక ఆర్థికవేత్త యుద్ధం ముగియవచ్చని అంచనా వేశారు. బ్యారెల్‌కు 85 నుంచి 95 డాలర్ల ధర ప్రత్యేకించి సవాలు కాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

భారతదేశంలో ప్రస్తుత, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున దేశీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, వాటి ప్రభావం పడకుండా ప్రభుత్వం భరించే అవకాశముందని అన్నారు. ఇదిలా ఉంటే, మూడీస్ నివేదిక ప్ర కారం, ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకున్నప్పటికీ భారతదేశానికి పెద్ద ము ప్పు ఉండబోదు. రిఫైనింగ్‌కు రక్షణ కల్పించినంత కాలం అధిక ముడి చమురు ధరలు కం పెనీలపై గణనీయమైన ప్రభావం చూపబోవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News