Friday, July 11, 2025

నేను పార్టీ మారను: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ తెలిపారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను అరుణ ఖండించారు. బిజెపి జాతీయ నాయకత్వం తనని గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. కావాలని కాంగ్రెస్ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టముండాలన్నారు. డికె అరుణ్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News