Sunday, June 2, 2024

బాస్మతి బియ్యం ఎగుమతి ధర టన్నుకు 950 డాలర్లకు తగ్గింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం బాస్మతి బియ్యం ఎగుమతి ధరను టన్నుకు 1200 డాలర్ల నుంచి 950 డాలర్లకు తగ్గించింది. అధిక ధరల కారణంగా ఎగుమతి మరింత భారం అవుతోందనే ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎపిఇడిఎ (వ్యవసాయం, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ) ఈమేరకు ప్రకటన చేసింది. ఒక్క టన్నుకు 1200 డాలర్ల నుంచి 950 డాలర్లకు బాస్మతి బియ్యం ఎగుమతి ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 27న ప్రభుత్వం 1200 డాలర్ల లోపు బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News