Sunday, May 12, 2024

1901 నుంచి ఆరోసారి అతిస్వల్పంగా ఈశాన్య రుతుపవనాల వర్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సాధారణంగా దక్షిణ భారతం లోని ముఖ్యమైన ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో భారీగా వర్షాలు కురియడం పరిపాటిగా వస్తోంది. కానీ ఈఏడాది అక్టోబర్‌లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు అతిస్వల్పమని, ఈ విధంగా అతిస్వల్పం కావడం 1901 నుంచి ఆరోసారిగా భారత వాతావరణ విభాగం (ఐఎండి) అంచనా వేసింది. 1980 నుంచి 2022 వరకు డేటా పరిశీలిస్తే ఈశాన్య రుతుపవనాల ప్రారంభం ఆలస్యమయ్యే ధోరణి కనిపిస్తోందని వివరించింది.

దక్షిణ భారత ద్వీపకల్పంలో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక లోని దక్షిణ అంతర్భాగం, కేరళ ఈ అయిదు సబ్ డివిజన్లలో ఏటా అక్టోబర్‌లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువ. అయితే ఈసారి మాత్రం స్వల్పమైంది. 1901 సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ విధంగా ఆరో అతిస్వల్పంగా పరిగణించాల్సి ఉంటుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సంవత్సరాల కాలంలో ఎల్‌నినో అంటే దక్షిణ అమెరికా సమీపాన పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం , రుతుపవనాలు బలహీనంగా ఉండడం, దేశంలో పొడి వాతావరణం అలముకుందని, అలాగే ఆఫ్రికా సమీపాన హిందూ మహాసముద్ర పశ్చిమ ప్రాంతాలు, ఇండోనేషియా సమీపాన తూర్పు ప్రాంతాల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాల కారణంగా అక్టోబర్‌లో తమిళనాడు,పరిసర ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురిసిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News