Saturday, May 11, 2024

కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటర్(టికెఎం) దేశంలో ప్రస్తుత కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. విస్తరణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మసకాజు యోషిమురా సంతకాలు చేశారు. ఇది భారతదేశంలోని కంపెనీకి మూడో ప్లాంట్, ఇది కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిదాడిలో ఉంది. ఎంఒయులో భాగంగా కంపెనీ దాదాపు రూ.3,300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ కొత్త ప్లాంట్ 2026లో పూర్తవుతుంది. కొత్త ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా లక్ష యూనిట్లు పెంచుతుందని అంచనా. ఈ ప్లాంట్‌తో సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News