Saturday, August 2, 2025

హైదరాబాద్ లో 3.20 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో బుధవారం రాత్రి పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్ పేటనుంచి నగదు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఓఆర్ఆర్ వద్ద కార్లను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఒక కారును తనిఖీ చేస్తుండగా అందులో రెండు కోట్ల రూపాయలు లభించాయి.  ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బును చౌటుప్పల్ కు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు.

ఎల్బీనగర్ కు చెందిన బండి సుధీర్ రెడ్డి అనే వ్యక్తి కారులో కోటీ ఇరవై లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుధీర్ రెడ్డి భువనగిరికి వెళ్తుండగా పోలీసులు మధ్యలో ఆపి, తనిఖీ చేయగా నగదు బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News