Thursday, September 18, 2025

రాజశేఖర్ రెడ్డి విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి: దిగ్విజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్‌ లో దిగ్విజయ్ సింగ్ అధివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్య మేలుతోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడగొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. అప్పట్లోనే ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే పక్కాగా అమలు చేస్తుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News