Thursday, May 16, 2024

కమలం అగ్రనేతలు ఓటమి

- Advertisement -
- Advertisement -

ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఫలితాల్లో కమలం పార్టీ ఉనికి చాటుకుంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన మొదటిసారి ఎన్నికల్లో 5 సీట్లు, 2018 ఎన్నికల్లో ఒకటి సీటు గెలిచిన కమలం పార్టీ ఈఎన్నికల్లో 8 స్దానాల్లో విజయం సాధించింది. 119 స్దానాల్లో బిజెపి పోటీ చేస్తే అందులో ముగ్గురు పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సీటులో పోటీ చేసి ఓటమి చవిచూశారు.

కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మంత్రి గంగుల కమలాకర్‌రావుపై ఓడిపోయారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపి దర్మపురి అరవింద్ బరిలో నిలిచి కల్వకుంట్ల సంజయ్ కంటే వెనకబడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి సోయం బాపురావు పోటీ చేసి అనిల్ జాదవ్‌పై ఓడిపోయారు. అదే విధంగా 2004 నుంచి హూజురాబాద్‌లో వరుసగా విజయం సాధిస్తున్న ఈటెల రాజేందర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై పరాజయం పొందారు. దీంతో పాటు గ్రేటర్ నగరంలో సనత్‌నగర్ నుంచి బరిలో నిలిచిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్ది మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఓటమి పాలైయ్యారు. ఈఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేసిన హేమాహేమీలు ఓడిపోవడం ఆపార్టీ భవిష్యత్తుల్లో తెలంగాణలో అధికారం చేపట్టడం కలగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News