Saturday, June 8, 2024

గవర్నర్ తమిళిసై ప్రసంగం చాలా బాధాకరం: మాజీ ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగం చాలా బాధాకరమని ఎఫ్‌డిసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను పరాయి పాలన నుండి, వివక్ష నుండి విముక్తి చేసిన నాయకుడు ఉద్యమనేత, మాజీ సిఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్రం సాధించడమే కాకుండా స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ కాలంలో దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలిపారని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మాట్లాడినట్లు ఉందని, బాధ్యత గల పదవిలో ఉండి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలే విషయం మరిచిపోయి అవాస్తవాలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని తెలిపారు.

Tamilisai

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News