Monday, August 25, 2025

ములుగు నుంచే పాలన కొనసాగిస్తా : మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

ములుగు: రాష్ట్ర మంత్రిగా ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. తాను ఎక్కడున్నా ములుగే తన కుటుంబం, ములుగు ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు. ప్రజలకు జవాబు దారిగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్న సీతక్క ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతానన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దోహద పడే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నానని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News