Friday, May 10, 2024

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం మొదటి రోజు జనవరి 1న స్టాక్ మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. సెన్సెక్స్ 72,561, నిఫ్టీ 21,834 పాయింట్లతో ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. అయితే దీని తర్వాత స్వల్ప క్షీణతతో సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 72,271 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీలో 10 పాయింట్లు పెరిగి 21,741 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 19 క్షీణించగా, 13 లాభపడ్డాయి. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా స్టాక్ వరుసగా రెండో ట్రేడింగ్ రోజు కూడా పెరిగింది. ఈ స్టాక్ 5.94 శాతం పెరుగుదలతో రూ.16.95 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 23 శాతం పెరిగింది. అదానీ గ్రూప్‌లోని మొత్తం 9 షేర్లు కూడా లాభపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News