Wednesday, August 13, 2025

గురుకుల పాఠశాలలో విషాదం.. విద్యార్థి హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: చిన్న వ‌య‌సులోనే గుండెపోటుతో చిన్నారులు చనిపోతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి వరకు అందరూ విద్యార్థులతో కలిసి మెలిసి తిరిగిన శ్రీకాంత్ ఉన్నట్లుఉండి కుప్పకూలిపోయాడు. శ్రీకాంత్‌ ను హన్వాడ మండలం బుడుగుకొండకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. పాఠశాల సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. చేతికొచ్చిన కొడుకు ఇలా చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News