Friday, May 3, 2024

గుజరాత్‌లో అంతర్జాతీయ పతంగుల పండగ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగ సందర్భంగా గుజరాత్‌లో అంతర్జాతీయ పతంగుల పండగ ప్రారంభమైంది. ఏటా జనవరి 7న అహ్మదాబాద్‌లో ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీ. గుజరాత్ పర్యాటక శాఖ ఆదివారం ఈ పండగను ప్రారంభించింది. అహ్మదాబాద్‌లో నిర్వహించే ఈ పండగకు చరిత్ర ఉంది.

అహ్మదాబాద్‌కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్ భాయ్ రహింభాయ్ 1989 జనవరి 7న 500 గాలిపటాల రైలును తయారు చేసి ఎగురవేశాడు. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 7న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పండగ జరుగుతుంది. జనవరి 14 వరకు ఈ పండగ సాగనుంది. వివిధ ప్రాంతాల ప్రజలు ఒకచోట చేరి పతంగులు ఎగురవేస్తారు . అహ్మదాబాద్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పతంగ్‌ను ఎగురవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News