Thursday, May 9, 2024

ప్రఖ్యాత హిందీ కవి హరిరామ్ ద్వివేది కన్నుమూత

- Advertisement -
- Advertisement -

వారణాసి (యూపీ) ప్రఖ్యాత హిందీ, భోజ్‌పురి కవి , గీతరచయిత, సాహితీవేత్త, పండిట్ హరిరామ్ ద్వివేదీ సోమవారం మధ్యాహ్నం మహమూర్‌గంజ్ ఏరియాలో తన స్వగృహంలో కన్నుమూశారు. హరిభయ్యాగా అందరికీ పరిచయమైన ఆయన వయసు 87 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మణికర్ణిక ఘాట్‌లో జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన ఆరోగ్యం ఆదివారం క్షీణించిందని, సోమవారం తుది శ్వాస విడిచారని చెప్పారు. ద్వివేదీ మృతికి ప్రధాని మోడీ తీవ్ర సంతాపం తెలియజేశారు. కాశీ నివాసి అయిన ద్వివేదీ హిందీ సాహిత్యంలో విశేష కృషి చేశారని, అంగనైయా, జీవనదాయని గంగ, తదితర పద్యరచనలు సాగించారని, ఆయన నిత్యం మన జీవితాల్లో జీవిస్తుంటారని నివాళులు అర్పించారు. భగవంతుని పాదాల చెంత సరైన స్థలం ఆయనకు లభించాలని కోరుకుంటున్నట్టు ప్రధాని తన సంతాపంలో నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News