Thursday, May 16, 2024

తెలంగాణలో షర్మిల బాధితులు ఏపిలో ప్రచారం!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల మాయమాటలు నమ్మి ఆమె ఏర్పాటు చేసిన పార్టీలో చేరి పార్టీకార్యక్రమాల పేరిటో సమయాన్ని, ధనాన్ని నష్టపోయి చివరకు పార్టీ కాంగ్రెస్‌లో విలీనంతో నష్ఠపోయిన బాధితులు అగ్రహంతో ఉన్నారు. ఏపిలో పిసిసి అధ్యక్షురాలిగా పదవీబాద్యతలు చేపట్టిన షర్మిలపై పగ తీర్చుకునేందుకు సిద్దమవుతున్నారు.

రానున్న ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిలకు వ్యతిరేంగా ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని, షర్మిల చేసిన ప్రకటనలు, చెప్పిన మాటలు, చేసిన మోసాలను ఏపి ప్రజలకు వివరిస్తామని, అమె నైజాన్ని ఎండగడతామని షర్మిల బాధితులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News