Thursday, September 18, 2025

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి!

- Advertisement -
- Advertisement -

సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే కన్నుమూసింది. కొంతకాలంగా సర్వైకల్ కాన్సర్ తో బాధపడుతున్న పూనమ్ కాన్పూర్ లో గురువారం మరణించింది. ఆమె వయసు 32 ఏళ్లు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె మృతికి చెందిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

టీమిండియా 2011 ప్రపంచ క్రికెట్ కప్ గెలిస్తే తాను నగ్నంగా పోజులిస్తానని ప్రకటించి తొలిసారిగా అందరి దృష్టిలోనూ పడింది పూనమ్. నషా అనే మూవీ ద్వారా 2013లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన పూనమ్.. మాలినీ అండ్ కో, లాకప్, ఖత్రోంకే ఖిలాడీ వంటి సినిమాలలో నటించింది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొంది. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రకటనలు, ఫోటోల ద్వారా తరచూ వివాదాల్లో తలదూర్చేది.

శామ్ బాంబే అనే వ్యక్తిని పూనమ్ వివాహమాడినా, ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. శామ్ గృహ హింసకు పాల్పడుతున్నాడని, తరచూ తనపై చేయి చేసుకుంటున్నాడన్న అరోపణలతో 2020లో అతనినుంచి విడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News