Tuesday, September 16, 2025

కుమారుడికి స్మారక చిహ్నం… తల్లి ప్రేమ గొప్పది

- Advertisement -
- Advertisement -

మెదక్: అమరుడైన తన కుమారుడికి స్మారక చిహ్నం కన్నతల్లి ఏర్పాటు చేశారు. కుమారుడు కన్నుమూసిన చోట తన తల్లి ప్రేమను గొప్పగా చాటారు. తన చేతిపై కూడా తనయుడి చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతం రావెల్లి గ్రామ శివారులో డిసెంబర్ 4న ఉదయం 8.30 గంటలకు శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు కన్నుమూశారు. ఈ ప్రమాదంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర డెహ్రాడూన్‌కు చెందిన అభిమన్యు రాయ్ తోపాటు మరొకరు దుర్మరణం చెందారు. అభిమన్యురాయ్ తల్లి చంద్రలేఖ రాయ్ స్థానిక అధికారుల సాయంతో అదే స్థలంలో తనయుడి చిత్రంతో నామఫలకాన్ని ప్రతిష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News