Thursday, September 18, 2025

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైఠాయింపు

- Advertisement -
- Advertisement -

శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించి, ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల వైఖరికి నిరసనగా బయటకు వచ్చి మీడియా పాయింట్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే బైఠాయించారు. కేటీఆర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి తదితరులు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనూ, బయటా తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News